calender_icon.png 5 February, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు

05-02-2025 02:20:14 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 4: కులాల మధ్య వైశమ్యాలను రెచ్చగొడుతూ రెడ్డి కులస్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మంగళవారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

వరంగల్‌లో జరిగిన బీసీ సభలో రెడ్డి కులాన్ని తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో దూషించడాన్నారు. మానవ సంబంధాలలో విఘాతాన్ని కల్పించే విధంగా ప్రవర్తిస్తున్న తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.