calender_icon.png 23 January, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ కు ఫిర్యాదు

02-09-2024 05:03:38 PM

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేర్ర కామేష్ 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో అక్రమంగా నిర్మిస్తూన్న నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేర్రా కామేష్, కలెక్టర్ జితేష్  వి.పాటిల్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా 30వ వార్డు మధుర బస్తీలో అనుమతి లేకుండా అక్రమ సెల్లార్ నిర్మాణం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న అధికారులు నోటీసు లతో చేతులు దులుపుకొని అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆయన ఆరోపించారు.

స్థల యజమాని రాజకీయ అండదండలు ఉన్నాయనే థీమాతో జాతీయ రహదారిపై నిర్మిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటి ముందు పూల కుండీలు పెట్టుకుంటే నోటీసులు ఇచ్చి కుండీలను తీస్తున్న మున్సిపల్ అధికారులు,బస్టాండ్ వద్ద, సెయింట్ మేరీస్ స్కూల్ ఎదురుగా, శాంతన్ బాబు కంటి ఆసుపత్రి పక్కన జరుగుతున్న అక్రమ నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.