17-03-2025 10:46:14 PM
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): ఆదిభట్ల మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్ కు ఆదిభట్లకు చెందిన పల్లె శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిభట్ల మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు భారీగా జరుగుతున్నాయనీ తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కు ఎదురుగా ఉన్న ఆదిభట్ల మున్సిపాలిటీలో కన్సల్టెన్సీ సర్వీసెస్, శ్రీ మిత్ర వెంచర్ సర్వేనెంబర్ 72, 73, 74, 75, 76, 77, 78 ప్రభుత్వ పార్కు భూమిని ఆక్రమించి అక్రమంగా బిల్డింగులు చేస్తున్నారని గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని వాపోయారు.
ప్రభుత్వ భూములలో ఉండాల్సిన పార్కులు ఆక్రమణకు గురవుతున్న మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2003 సంవత్సరంలో ఆదిభట్ల మున్సిపాలిటీ ఆదిభట్ల మేనేజర్, ఆఫీసర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు, 2004 సంవత్సరంలో మానవ హక్కుల కమిషన్ కు, 2024 లో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో, 2023 నుండి 2025 వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో, 2024 లో ప్రజా దర్బార్ తెలంగాణ ముఖ్యమంత్రి కి ఫిర్యాదు ఇచ్చాము కానీ ఇప్పటి వరకు నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదేవిధంగా మరియాపురం కాలనీలోని సర్వేనెంబర్ 73 పాత రికార్డుల ప్రకారం సమాధి స్థలం 20 గుంటలు, ఆ సమాధి స్థలాన్ని కూడా శ్రీమిత్ర వెంచర్ లో విలీనం చేశారు.
సర్వేనెంబర్ 73 లో 20 గుంటల సమాధి స్థలాన్ని పరిశీలించి, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదిభట్ల మున్సిపాలిటీలో ఇళ్ల నిర్మాణానికి జి+2 అనుమతులు ఉన్నాయి. కానీ మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై జి+6 వరకు నిర్మాణాలు చేస్తున్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ కమిషనర్ మద్దతుతో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి ప్రభుత్వ సొమ్మును పోగు చేసుకుంటున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.