01-03-2025 10:11:13 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): సింగరేణి కార్మికుని సమస్యపై చర్చించేందుకు మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ జి. దేవేందర్ ను సంప్రదించడానికి వెళ్తే తనను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించారని కార్మిక సంఘం నాయకుడు దాగం మల్లేష్ శనివారం బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ కు ఫిర్యాదు చేశారు. దళితుడినైన తనను అసభ్యకరంగా తిడుతూ అవమానించిన జిఎం దేవేందర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏసీపికి ఇచ్చిన ఫిర్యాదులో దాగం మల్లేష్ కోరారు. జిఎం దేవేందర్ పై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు, తెలంగాణ ఎస్సీ కమిషన్ సభ్యులు, సింగరేణి సి అండ్ ఎండి కి ఫిర్యాదు చేయనున్నట్లు దాగం మల్లేష్ తెలిపారు.