01-03-2025 07:04:57 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): అదిలాబాద్ లోని ఓ కాలనిలో ఇటీవల ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని ఆయా రాజకీయ పార్టీల మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ అలం లను కలిసి విన్నవించారు. బాధిత బాలిక ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను త్వరలో కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాజిద్ ఖాన్, నజీర్, సాజిదోద్దీన్ తదితరులు ఉన్నారు.