calender_icon.png 1 November, 2024 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేణుస్వామిపై ఫిల్మ్ జర్నలిస్టుల ఫిర్యాదు

13-08-2024 12:00:00 AM

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడి యా అసోసియేషన్ బాధ్యులు సో మవారం జాతకాల వేణుస్వామి తీరును తప్పు పట్టారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నీరెళ్ల శారదను సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీలపై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణుస్వామికి వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడ దనే ఇంగిత జ్ఞానం కూడా లేదు.

గతంలో సినిమా రిలీజ్‌లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసు పాలైనప్పటికీ బుద్ధి రాని వేణుస్వామి నాగచైతన్య అలాంటి వ్యాఖ్యలే చేశాడు. అతనిపై చర్యలు తీసుకోవాని మహిళా కమిష న్ చైర్‌పర్సన్‌ను కోరాం’ అని ఉభ య అసోసియేషన్ల బాధ్యులు వివరించారు. వేణుస్వామిపైనా, ప్రోత్స హించిన యూట్యూబర్ల పైనా చర్య లు తీసుకుంటామని చైర్‌పర్సన్ హా మీ ఇచ్చారని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రేమమాలిని వనం తెలిపారు.