calender_icon.png 15 March, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టెడన్నం పెడతలేరయ్యా

15-03-2025 01:04:10 AM

 నా చిన్న కుమారుడు నన్ను పట్టించుకోవట్లే

 జర చెప్పండి అంటూ కలెక్ట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాలప్ప 

మహబూబ్ నగర్ మార్చి 14 (విజయ క్రాంతి) : ఏ తండ్రికి ఈ బాధ రాకూడదు అయ్యా.. మీ బిడ్డలను మీరు ఇప్పుడు ఎలా పెంచుతున్నారో అంతకంటే జరా చాలా కష్టపడి మేము మా బిడ్డలని పెంచినం... పెద్దోడు అన్నం పెడు తుండు... ఉన్న ఆస్తి ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చిన... చిన్నోడు అస్సలు పట్టించుకుంటలే.. అంటూ నవాబ్ పేట్ మండలం కాకర్లపాడు గ్రామానికి చెందిన బాలప్ప గురువారం కలెక్టరేట్లో బాలప్ప తన ఫిర్యాదును పట్టుకుని తిరుగు తున్నారు. తన ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కు ఇచ్చి తన చిన్న బిడ్డ కూడా తనకు అన్నం పెట్టేలా చూడాలని కోరుతానని చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక క్షణం ఆలోచించి.. మీ బిడ్డలను మీరు ఎలా పెంచుతున్నారు మిమ్మల్ని కూడా అలాగే మీ తల్లిదండ్రులు పెంచారని ఈ దాసలేని నిజాన్ని స్మరించుకుంటూ తల్లిదండ్రులను బుక్కెడు అన్నం కోసం ఇబ్బందులు గురి చేయకూడదని కలెక్టరేట్ కార్యాలయంలోని శాఖ జిల్లా అధికారి సూచించారు.