calender_icon.png 22 September, 2024 | 11:59 AM

కులం పేరుతో దూషించారని ఫిర్యాదు

20-09-2024 12:05:26 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 19: గణేశ్ నిమజ్జనం సందర్భంగా బుధవారం రాత్రి చైతన్యపురిలో వివాదం చోటుచేసుకుంది. సరూర్ నగర్‌లోని చెరుకు తోట కాలనీ హరిజనబస్తీకి చెందిన దళితులు తాము ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి చైతన్యపురి మెట్రో స్టేషన్ మీదుగా అరవిందో కళాశాల వరకు ర్యాలీగా వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు బీఆర్‌ఎస్ నాయకులు తమ ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని చెరుకుతోట కాలనీ దళితులు ఆరోపించా రు. దాడికి నిరసనగా గురువారం మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్ ఆధ్వ ర్యంలో చెరుకుతోటకాలనీ దళితులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బాలకిషన్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు జక్కిడి రఘువీరారెడ్డి, ప్రతీ క్, విజయ్ తదితరులు మద్యం మత్తులో కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని, దాడిలో గాయపడిన మహిళకు సైతం సకాలంలో వైద్యం అందించడానికి పోలీసు లు చర్య లు తీసుకోలేదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయా లని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.