calender_icon.png 27 December, 2024 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసిపేట బాలుర గురుకులాన్ని మార్చాలని వినతి

02-12-2024 03:32:22 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాసిపేట బాలుర సంక్షేమ గురుకుల కళాశాలను వెంటనే మరో చోటికి మార్చాలని సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ దీపక్ కుమార్ కు బెల్లంపల్లికి చెందిన జంజర్ల రాజశేఖర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కొనసాగుతున్న కళాశాలకు అతి సమీపంలోనే గ్యాస్ గోదాం ఉండడంతో నిత్యం ప్రమాదం పొంచి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం కళాశాల భవనం కూడా గ్యాస్ గోదాం యజమానిది కావడంతో గురుకుల విద్యాలయ సంస్థ అధికారులు గాని, అధ్యాపకులు గాని పట్టించుకోవడంలేదని తెలిపారు. గ్యాస్ గోదాం పక్కన కళాశాల ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదం అని తెలిసిన, గతంలో పనిచేసిన గురుకుల విద్యాలయ సంస్థ అధికారిణి గ్యాస్ గోదాం యజమాని నుండి మామూళ్ళు పొంది కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరిపి ప్రమాదకరంగా మారిన కళాశాలను వెంటనే మరోచోటికి తరలించి విద్యార్థులను ప్రమాదం భారీ నుండి కాపాడాలని కోరారు.