16-02-2025 12:08:13 AM
వినతిపత్రం సమర్పించిన బంగారు శ్రుతి
హైదరాబాద్, ఫిబ్రవరి15 (విజయక్రాం తి): మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వంగ మహేందర్‌రెడ్డి సోదరుడు వంగ రవీందర్ రెడ్డి అధికా రులు, టీచర్లను భయపెడుతున్నారంటూ బీజేపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి నేతృత్వంలో శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతిపత్రం సమర్పించారు.
బంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లఘింస్తూ వంగ మహేందర్ రెడ్డి అనుకూలంగా తన అసోసియేషన్ ను ఉపయోగించి వివిధ జిల్లాల్లో జిల్లా, మండల విద్యాధికారులు, టీచర్లను భయపెడుతూ ఓటు వేయాలని ప్రభావితం చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ గోకుల్ రామారావు, ఆర్టీఐ జాయింట్ కన్వీనర్ పవన్ మైత్రేయ తదితరులు ఉన్నారు.