calender_icon.png 23 February, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్నేరువరం ఎస్‌ఐపై లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

23-02-2025 12:04:24 AM

కరీంనగర్,(విజయక్రాంతి): అధికార దుర్వినియోగానికి పాల్పడిన గన్నేరువరం ఎస్‌ఐ తాండ్ర నరేష్‌ను సస్పెండ్ చేయాలని బాధితుడు అచ్యుత్ గౌడ్  కోరారు. ఈ మేరకు శనివారం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. జిల్లాలోని గన్నేరువరం ఎస్‌ఐ తాండ్ర నరేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడి తనపై అకారణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి, విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టి, దూషించారని, దీనిపై సీపీకి ఈ నెల 18న పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానని తెలిపారు. తనను తాగుబోతులా చిత్రీకరించే విధంగా ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.  ఈ విషయంలో కాంప్రమైజ్ కాకపోతే నీ అంతుచూస్తానని ఎస్‌ఐ బెదిరిస్తున్నాడని, అందుకే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.