01-04-2025 08:25:20 PM
ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని తెలియజేసిన : మాజీ మంత్రి వనమా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేశారని, 420 వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని భారీ ప్రదర్శనగా వెళ్లి కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేందర్ గారు,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదవత్ శాంతి, మాజీ కౌన్సిలర్లు అంబుల వేణు, రుక్మందర్ బండారి, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, టీబీజీకేస్ నాయకులు కూసాని వీరభద్రం, మాజీ సర్పంచ్ ఆంగోత్ మోతి, సాగర్,రజాక్, మాజీ ఉపసర్పంచ్ దుర్గేష్, బిఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు బత్తుల మధు చంద్ బిఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ (సంపు), నవత, నాగబాబు, రాజేంద్రప్రసాద్, కన్నె, జానీ, తాండ్ర శీను, కరాటే శీను, శ్రీధర్, బాదావత్ శ్రీకాంత్, జయరాం, పిల్లి కుమార్, మహిళా నాయకురాలు మంజుల, సింధు తపస్వి, నవభారత్ వీరన్న, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.