26-04-2025 12:00:00 AM
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై భగ్గుమన్న బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు
ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : సోషల్ మీడియాలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసిన లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులతో కలిసి గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటట్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తా వద్ద నిరసన నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తన నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా వక్రీకరించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసినట్లుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బలు తీసే విధంగా తీవ్రవాదుల దిష్టిబొమ్మను మార్ఫింగ్ చేసి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నట్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారన్నారు.
సోషల్ మీ డియాలో తప్పుడు ప్రచారం చేసిన పాల్పడిన కాంగ్రెస్ నాయకుడు, లింగోజిగూడ డి విజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపా రు.
లింగోజిగూడ డివిజన్‌లో కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులు ఉ న్నారని, దీనిపై దృష్టి సారించారని సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డిని కోరారు. కార్యక్రమం లో బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయ ప్రకాశ్, నాయకులు ఏనుగు శ్రీధర్ రెడ్డి, కృష్ణంరాజు, కిరణ్, శ్రవణ్ గౌడ్, దామ రాకేశ్ యాదవ్, సతీశ్, శివ రామ్, గిరీష్, టీంకు, వినయ్ పాల్గొన్నారు.