calender_icon.png 15 March, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్వి నాయకులుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

15-03-2025 12:09:57 AM

యాదాద్రి భువనగిరి : సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చే విధంగా నకిలీ వీడియోలను ప్రదర్శించే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కే విజయ రావు, డాక్టర్ కందుల మచ్చుకోట, యాద గిరి, రవి కిరణ్ మురళి, అనిల్ , వర్ధన్, అభిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యా దు చేశారు. నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో దుష్ప్ర చారం చేయడాన్ని యూత్ కాంగ్రెస్ నాయ కులు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారు యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఎడమ ప్రవీణ్, ఎన్ ఎస్ యు ఐ జాతీయ ప్రతినిధి ఎడమ పవన్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నోముల తరుణ్, రంజిత్ సాయి నివాస్ తదితరులున్నారు.