calender_icon.png 3 April, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

28-03-2025 12:31:47 AM

ఎల్బీనగర్, మార్చి 27 : హస్తినాపురం డివిజన్ గిరిజన మహిళా కార్పొరేట్ప అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే, ఇప్పటికీ ఆయనను అరెస్ట్ చేయకపోవడంతో గిరిజన సంఘాల నేతలు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురువారం  ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్ లో జాతీయ ఎస్సీ, ఎస్టీ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కు గిరిజన సంఘాల నాయకులు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గిరిజన సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కార్యక్రమంలో గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్, గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్ రాథోడ్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర లక్ పతి నాయక్, బంజారా విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్, భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.  ఎస్సీ, ఎస్టీ కమిషన్  తక్షణమే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తామని కమీషన్ సభ్యుడు హామీ ఇచ్చినట్లు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.