calender_icon.png 13 March, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా జడ్జిపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు

13-03-2025 12:56:09 AM

* 5వ రోజు కొనసాగిన న్యాయవాదుల విధుల బహిష్కరణ

నారాయణపేట మార్చి 12: (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా జడ్జి అబ్దుల్ రఫి పై చర్యలు తీసుకోవాలని పేట బార్ అసోసయేషన్ తరపున హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహ రెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్  సుజయ్ పాల్ కు ఫిర్యాదు చేశారు.

నారాయణపేట జిల్లా జడ్జి న్యాయవాదుల పట్ల అనుచి తంగా ప్రవ ర్తిస్తూ కించప రుస్తూన్నారని ,కోర్టులో సిబ్బంది నియామకాల్లో అక్రమాలకు పాల్ప డ్డా రని, కోర్టు సామాగ్రి కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.కాగా జిల్లా జడ్జి  వైఖరిని నిరసిస్తూ  బుధ వారం 5వ రోజు  బార్ అసోసి యేషన్ అధ్వర్యంలో న్యాయ వాదులు జిల్లా కోర్టు విధుల ను బహిష్కరిం చారు.

జిల్లా జడ్జి రఫీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణ రహితం గా క్లైంట్ లను, న్యాయ వాదులను కించపరు స్తూన్నారని అందుకు నిరసనగా విధులు బహిష్కరిం చాలని వీధుల బహిష్కరణ బార్ అసోసి యేషన్ అధ్వర్యంలో గత 5 రోజులుగా నిర్వహిస్తు న్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, అసోసి యేషన్ సభ్యులు తెలిపారు.

జిల్లా జడ్జి వ్యవహా రంపై చర్యలు తీసుకోవాలని అంతవరకు పోరాటం చేస్తా మని అన్నారు. ఈ కార్యక్ర మంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, కార్యదర్శిభిమ్రెడ్డి,న్యాయవాదులు రఘువీర్ యాద వ్,సీతా రామారా వు,సలీం, అమిరొద్దిన్, మల్లికార్జున్, సతీష్, మదన్, కూర్మన్న గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి, న్యాయ వాదులు పాల్గొన్నారు.