10-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): యూట్యూబర్ విజయరెడ్డిపై హైదరాబాదులో బుధవారం పోలీసులకు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో బద్నాం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దళితుడు ఇంట్లో చేసిన భోజనం హైదరాబాదు నుంచి తెచ్చిన లంచ్‌బాక్స్ అంటూ దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్న విజయరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మెట్టు సాయికుమార్ కోరారు.