01-04-2025 05:30:13 PM
ఇల్లెందు (విజయక్రాంతి): 2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గద్దెనెక్కడం కోసం ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన 13 అంశాలను ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిని విస్మరించి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ మంగళవారం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జ్ బానోత్ హరిప్రియ, దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పట్టణ, మండల పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్రగా ఇల్లందు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ప్రజలను వంచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలపై మోసం చేసిన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమ సీనియర్ నాయకులు సిలివెరి సత్యనారాయణ, లకావత్ దేవిలాల్ నాయక్, 11వార్డు మాజీ కౌన్సిలర్ జె కె శ్రీను, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్ రావు, ఇల్లందు మండలం అధ్యక్షుడు శీలం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఇల్లందు మండలం ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర భావసింగ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ దాసం ప్రమోద్, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొక్కు సరిత, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, గిన్నారపు రాజేష్, సాత్తాల హరి కృష్ణ, రాచపల్లి శీను, సర్దార్ పాషా, తదితరులు పాల్గొన్నారు.