- పెట్టుబడిపై 25 శాతం అధికంగా చెల్లిస్తామని..
- సంస్థ ఎండీ శ్రీధర్ హామీ ఇచ్చారని బాధితుల ఆరోపణ
- ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూల్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): నగరంలో రోజుకో రియల్ మోసం వెలుగు చూస్తోంది. కష్టపడి సంపాదించిన సొ మ్మును రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో కొందరు అక్రమార్కులు రాబందుల్లా తన్నుకుపోతున్నారు. తాజాగా సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవల పర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారు, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఫిర్యా దు చేయడం సంచలనంగా మారింది.
సదరు సం స్థ ఎండీ శ్రీధర్‌పై పలువురు సాఫ్ట్‌వేర్, రిటైర్డ్ ఉ ద్యోగులు హైదరాబాద్ సీసీఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరిట తమను మోసం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 200 మంది బాధితులు ఉన్నా రని, ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు తెలిపారు.
త మ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిన్నర తర్వాత పెట్టి న పెట్టుబడి మొత్తంపై 25 శాతం ఎక్కువ చెల్లిస్తామని సంస్థ ఎండీ శ్రీధర్ హామీ ఇచ్చారని బాధి తులు వాపోయారు. గడువు ముగిసినా డబ్బులివ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్‌పై కేసు నమోదు చేసి, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.