21-03-2025 04:53:37 PM
పెద్ద సంఖ్యలో కలెక్టరేడుకు తరలివచ్చిన ఏనుగు వర్గీయులు
నిజామాబాద్,(విజయక్రాంతి): తన అనుచర్లకు కాంట్రాక్టు పనులను అప్పగిస్తూ గ్రామాల నుంచి వచ్చే ప్రతిపాదనలను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) పట్టించుకోవడంలేదని ఏనుగు రవీందర్ రెడ్డి(Eanugu Ravinder Reddy) వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు పెద్ద సంఖ్యలో నిజామాబాద్ కలెక్టరేట్‌కు రవీందర్ రెడ్డి వర్గీయులు తరలిరావడంతో వీరి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ప్రధాన గేటు వద్దే ఏనుగు వర్గీయులకు అడ్డుకుని లోనికి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమను లోనికి ఎందుకు అనువదించలేదు అంటూ పోలీసులతో బాగోదానికి దిగారు. అనంతరం జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్(Additional Collector Kiran Kumar) గేటు వద్దకు వచ్చి ఫిర్యాదును స్వీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పనులు అప్పగించడం పై విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాన్సువాడ నియోజకవర్గం నుండి సుమారు 150 వాహనాల్లో 500 మంది పైగా కలెక్టరేట్ కు తరలి రావడంతో కలెక్టరేట్ లో ఉద్రిక్తత నెలకొంది.