calender_icon.png 14 March, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదిపై బార్‌కౌన్సిల్‌లో ఫిర్యాదు

13-03-2025 12:27:32 AM

చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపణ

జనగామ, మార్చి 12 (విజయక్రాం తి): జనగామ జిల్లాకు చెందిన ఓ న్యాయవాది తన  వృత్తిని అడ్డు పెట్టుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జనగామ  పట్టణానికి చెందిన తిప్పారపు ఉపేందర్ అనే వ్యక్తి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో  ఫిర్యాదు చేశారు. మం గళవారం హైదరాబాదులో హైకోర్టు బార్ కౌన్సిల్ సెక్రటరీ  నాగలక్ష్మికి ఫిర్యాదు కాపీ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ  ప్లాటు విషయంలో పెద్ద మనిషిగా వచ్చిన తనపై జనగామకు చెందిన న్యాయవాది  ఎండబట్ల శ్రీహరి గతం లో హత్యాయత్నం చేయించి జైలుకు కూడా వెళ్లొచ్చారని  తెలిపారు.

అయి నా తన తీరు మారలేదని, కేసు వాప సు తీసుకోకుంటే చంపుతానంటూ  బెదిరిస్తున్నారని వాపోయారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తూ న్యాయవాద  వృత్తికి మచ్చ తెస్తు న్న శ్రీహరిపై బార్ కౌన్సిల్ తరఫున చర్యలు తీసుకోవాలని ఉపేందర్  డిమాండ్ చేశారు.