calender_icon.png 15 November, 2024 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖని వన్ టౌన్ సీఐపై ఫిర్యాదు

15-11-2024 12:44:50 AM

మహిళా కార్పొరేటర్లతో అసభ్య ప్రవర్తన!

రామగుండం, నవంబర్ 14: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డిపై మహిళా కార్పొరేటర్లు గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడం టూ ఫిర్యాదు చేశారు. ఇటీవల రామగుండంలో కూల్చివేతలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట శాంతియతంగా ధర్నా చేస్తుండగా, సదరు సీఐ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే తమ పట్ల దురుసుగా ప్రవర్తించి అవమానపరిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐపై చర్య లు తీసుకోవాలని ఏసీపీని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో కార్పొరేటర్లు కృష్ణవేణి, జనగామ కవిత, సరోజని, బాదె అంజలీదేవి, గాదం విజయ, మహిళా నాయకురాలు సంధ్యారెడ్డి ఉన్నారు.