కోదాడ (విజయక్రాంతి): ఫారెస్ట్ కార్యాలయం అక్రమలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలనాలు తీసి చెట్లు కొడుతున్నప్పటికీ కాసులకు కక్కుర్తి పడి అడిగినంత ఇవ్వకుంటే బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫారెస్ట్ అధికారి కబీర్ కులం పేరుతో దూషించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేట మండలం జయంతి పురం తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ నాయక్ ఆరోపించారు. ఫారెస్ట్ అధికారి కబీర్ ఇబ్బందులకి గురి చేయడంతో లారీకి 6000 రూపాయల లెక్క 10 లారీలకు 60 వేలు ప్రతినెల చెల్లించేవారిని వారు ఆరోపించారు. ఈ క్రమంలో ఇలా చెల్లించడం ఇబ్బందికరంగా మారిందని నిబంధన మేరకు 15 చెట్లకు చలానా తీసి అనుమతి తీసుకున్నానని, కానీ ఫారెస్ట్ అధికారి కబీర్ నాకు ఫోన్ చేసి ఎందుకు చలానా తీసావ్, నిన్ను ఎవరు తీయమన్నాడంటూ ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారని, ఆయన ఆవేదన చెందారు. చెప్పరాని మాటలతో కులం పేరుతో దూషించారని సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని పక్కన పోలీస్ స్టేషన్ తో పాటు ఫారెస్ట్ అధికారికి సైతం ఫిర్యాదు చేశారని తెలిపారు.