calender_icon.png 15 November, 2024 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌పై పీఎస్‌లో ఫిర్యాదు

10-11-2024 01:03:54 AM

చార్మినార్, నవంబర్ 9 : మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి.. పరువు నష్టం కలిగించేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పాతబస్తీ బీఆర్‌ఎస్ నాయకులు శనివారం మీర్‌చౌక్ ఏసీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు పైసల్‌ఖాన్, సాయితేజరావు, ఖుర్రం అలీ మాట్లాడుతూ.. మూసీ పాదయాత్ర సభలో రేవంత్‌రెడ్డి.. నేటి పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని..

  నేను, మంత్రి కోమటిరెడ్డి వెకంట్‌రెడ్డి కలిసి.. కేసీఆర్, కేటీఆర్‌పై బుల్డోజర్ ఎక్కిస్తామని హెచ్చరించడం తెలంగాణ ప్రజలను బాధకు గురి చేసిందన్నారు. ప్రజలకు అవసరమైన రాజకీయాలు చేస్తే తప్పులేదని.. కానీ కేవలం కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి భాష, ఆయన బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.