calender_icon.png 15 January, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌పై ఫిర్యాదు

01-08-2024 04:12:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జూలై 29వ తేదీన మధ్యరాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గైర్హాజరుపై మన్నె క్రిశాంక్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్వీట్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టను దిగజా ర్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ క్రిశాంక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.