calender_icon.png 24 December, 2024 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్సాం సీఎం హిమంతపై ఫిర్యాదు

04-11-2024 01:43:22 AM

  1. విభజన ప్రేరేపించే ప్రసంగాలు చేశారని ఇండియా కూటమి ఆరోపణ
  2. చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల అధికారికి లేఖ
  3. విమర్శలను తిప్పికొట్టిన హిమంత బిశ్వ శర్మ
  4. చొరబాటుదారులను అంటే వారికేం బాధ అని ప్రశ్న

రాంచీ, నవంబర్ 3: అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మాపై ఇండియా కూటమి నేతలు జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారికి శనివారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ‘విభజన ప్రేరేపిత’ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు.

నవంబర్ 1న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హిమంత్ శర్మ జార్ఖండ్ ప్రభుత్వం చొరబాటుదారులను ప్రోత్సహిస్తూ వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని విమర్శించారు. హిందువుల ఓట్లు రెండు వైపులా పడతాయ న్నారు. కానీ చొరబాటుదారులు మాత్రం ఒకవైపు మాత్రమే ఓటేస్తారంటూ వ్యాఖ్యానించారు.

ఈ మాటలపై ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంత్ శర్మ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని, ద్వేషపూరితమైన ప్రసంగం చేశారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలందరినీ చొరబాటుదారులుగా చూపించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

ఇలాంటి మాటల వల్ల సమాజంలో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్టు ఫిర్యాదులో ఆరోపించారు.

ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యంగ విరుద్ధమని, ఉన్నత న్యాయస్థానాల కూడా ఇటువంటి ప్రసంగాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. అయినప్పటికీ హిమంత్ శర్మ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ఆక్షేపనీయమన్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరారు. 

చొరబాటుదారులను అంటే వారికేం బాధ: హిమంత శర్మ

కూటమి నేతల తనపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంపై హిమంత్ శర్మ స్పందించారు. చొరబాటుదారుల గురించి మాట్లాడితే కూటమి నేతలకు ఎందుకు బాధ కలుగుతుందని ప్రశ్నించారు. చొరబా టుదారుల గురించి మాట్లాడొద్దని ఎక్కడైనా రాసుందా లేదా ఏదైనా చట్టం చెబుతుందా అని అడిగారు. హిందువుల గురించి మాట్లాడినంత మాత్రాన ముస్లింలను టార్గెట్ చేసినట్టు కాదన్నారు. అయినా తన ప్రసం గంలో ఎక్కడా ముస్లిం అనే పదాన్ని కూడా వాడలేదని వివరించారు.