20-03-2025 12:59:51 AM
మహబూబాబాద్ మార్చి 19, (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ అంగడి,తాయి బజార్ ఏడాదికి ఓపెన్ వేలం బుధవారం నిర్వహించగా కున్యతండాకు చెందిన మాజీ వార్డు కౌన్సిలర్ బానోతు కిషన్ రూ.26.02లక్షలకు ద క్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ కే.న రేష్ రెడ్డి తెలిపారు.
ఈ వేలం పాటలో నలుగురు పోటీ పడగా హోరా హోరీగా పాట కొనసాగింది.గతేడాది మొత్తం రూ.14.36లక్షలు పలికిన టెండర్ వేలం ఈ సారి 12 లక్ష లు అధికంగా పలకడంతో మున్సిపాలిటీకి కాస్తా ఆదాయం పెరిగింది.టెండర్ గెలుచుకున్న వారు మొత్తంలో 1/3 నగదు మునిసి పాలిటీకి వారం రోజుల్లో చెల్లించాల్సి ఉం టుందని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియలో భాగంగా తొలుత రూ.3.58లక్షలు పాట దక్కించుకున్న ముందస్తుగా చెల్లించారని మిగత నగదు, తొమ్మిది చెక్కులు,స్టాంప్ డ్యూటీ ఛార్జీలు చెల్లించి వారంలోగా మున్సిపాలిటీకి అందిస్తే ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారికి అప్పగిస్తామన్నారు.లేని పక్షంలో నిర్ణి త గడువు ముగిశాకా మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ముందస్తుగా చెల్లించిన నగదు రీఫండ్ చేయటం ఉండదని,మళ్లీ టెండర్లను పిలవటం జరుగుతుందన్నారు.