calender_icon.png 5 October, 2024 | 6:59 AM

పోటాపోటీగా ఎన్‌రోల్‌మెంట్

05-10-2024 12:59:57 AM

ప్రత్యేక ఆఫీసులు తెరిచిన ఆశావహులు 

3 లక్షలు దాటనున్న ఓటర్ల సంఖ్య 

డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా

కరీంనగర్, అక్టోబరు 4 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రు ల ఎమ్మెల్సీ(కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్) ఎన్నికల ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమయింది. సెప్టెంబర్ 30న ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభమైనప్పటికీ అక్టోబర్ 1, 2 తేదీల్లో అమావాస్య కావడంతో గురువారం పాఢ్యమి కావడంతో శుక్రవారం రోజు నుంచి ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నేతలు ప్రారంభించారు. పట్టభద్రుల ఓట్ల సంఖ్య 3 లక్షలు దాటే అవకాశం ఉంది. 

గెలుపు గుర్రాల కోసం వేట

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఔత్సాహికులు ఇప్పటికే రంగంలోకి దిగి నాలుగు ఉమ్మడి జిల్లాలను చుట్టి వస్తున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని గెలుపు గుర్రాల కోసం సర్వేలు ప్రారంభించాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఇస్తుందా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

మూడు ప్రధా న పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలో దింపేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇది లా ఉంటే తాము టికెట్ ఆశిస్తున్న పార్టీలు టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. దీంతో ఈసారి పట్టభద్రుల ఓటర్ల సంఖ్య గతంలో కంటే రెట్టింపయ్యే అవకాశం ఉంది. 

పోటీలో విద్యాసంస్థల అధినేతలు

ఇప్పటికే పలువురు విద్యాసంస్థల అధిపతులు, విద్యావేత్తలు తమ ప్రచారాన్ని ము మ్మరం చేశారు. ఫలానా పార్టీ నుంచి టికెట్ తమకేనన్న భరోసాతో ప్రచారం సాగిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుం చి పోటీ చేసే ఆశావహులు సంఖ్య కూడా రో జు రోజుకు పెరుగుతుంది.

గ్రాడ్యుయేట్స్‌తోపాటు ఉపాధ్యాయుల ఎన్‌రోల్‌మెంట్ కూ డా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధికారి కంగా ఎవరిని ప్రకటించలేదు. చంద్రశేఖర్‌గౌడ్‌కు బయట నుంచి మద్దతు ఇచ్చింది. దీంతో జీవన్‌రెడ్డి భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు.

ఈసారి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ అధికారికంగా అభ్యర్థిని బరిలో ఉంచాలనే ఆలోచనతో ఉండటం, ఈ నాలు గు జిల్లాల పరిధిలో బలం పుంజుకోవడం తో బలమైన అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వాతావరణం వేడెక్కింది. 

మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

రాష్ట్ర మంత్రివర్గంలో డి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్‌కు చెందిన బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ ఉన్నారు. విప్‌లుగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్ ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు వీరిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈసారి బీఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కొని గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం అన్వేషణలో ఉంది. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారికి మీ పని మీరు చేసుకోండి అంటూ భుజంతట్టి రంగంలో దించినటుట్ట సమాచారం. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందోనన్న ఆసక్తి పట్టభద్రుల్లో నెలకొంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బలంగా ఉంది. పెద్దపల్లి మినహా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

వీరితోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి మద్దతుతో టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలో దించే యోచనలో ఉంది. 

ప్రత్యేక ఆఫీసులు.. సిబ్బంది

ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రంగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఓటరు ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రత్యేక కార్యాలయాలను ఏర్పా టు చేసి, సిబ్బందిని నియమించి ఆన్‌లైన్ ద్వారా ఎన్‌రోల్‌మెంట్‌కు శ్రీకా రం చుట్టారు. ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రి య నవంబర్ 6 తో ముగియనుంది.

23న డ్రాఫ్ట్ రోల్స్ విడుదల చేసి డిసెం బర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తా రు. డిసెంబర్ 30న తుది జాబితాను వి డుదల చేస్తారు. తుది జాబితా విడుదలైన అనంతరం జనవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ఎమ్మెల్సీ పదవీకాలం 2025 మార్చి 29తో ముగియనుంది.

గతంలో బీఆర్‌ఎస్‌దే హవా..

గత ఎన్నికల సమయంలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్ ప్రస్తుతం బలహీనపడింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక పట్టభద్రుల ఓట్లను రాబట్టి ఎలాగైనా జెండా ఎగురవేయాలనే ఆలోచనలో ఉంది. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలైన కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి ఇప్పటి నుంచే వ్యూవహరచన చేస్తున్నారు.

బలమైన అభ్యర్థిని రంగంలో దించి కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. నాలుగు జిల్లాలతో పోలిస్తే కరీంనగర్‌లోనే బీఆర్‌ఎస్ నుంచి అత్యధికంగా నలుగురు ఎమ్మెల్యేలు కేటీఆర్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ ఉన్నారు.

అత్యధిక ఓటర్లు ఉండే కరీంనగర్ గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం ఏర్పాటు నుంచి గత ఎన్నికలు మినహాయిస్తే ప్రతిసారి బీఆర్‌ఎస్ అభ్యర్థికే పట్టంకట్టారు. ఈసారి కూడా మెజార్టీ ఓట్ల సాధన కోసం మాజీ మంత్రులు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాకున్నారు. ఇలా మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనుండడంతో ఈసారి ఎన్నిక హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది.