13-03-2025 12:44:45 AM
జనగామ, మార్చి 12(విజయక్రాంతి): సృజనాత్మకతను వెలికితీసేందుకు పోటీలు దోహదపడుతాయని నెహ్రూ యువ కేంద్ర సపరింటెండెంట్ బానోతు దేవీలాల్, జిప్స్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ అన్నారు. యువజనోత్సవాల్లో భాగంగా బుధవారం జనగామలోని జిప్స్ ఫార్మసీ కాలేజీలో యువతీయువకులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు.
యంగ్ రైటర్స్, యంగ్ ఆర్టి స్ట్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, జానపద నృత్యం(గ్రూప్), సైన్స్ ఎగ్జిబిషన్ తదితర పోటీలు నిర్వహించారు. ఆటల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ ఉత్సవ్ కార్యక్రమం యువత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోందన్నారు. విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు.