11-04-2025 01:23:06 AM
నేడు కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు
కరీంనగర్, ఏప్రిల్10(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద న్యాయవాదుల సంఘం అయినా కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం 2025- 26 ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను మరిపించే విధంగా జరిగే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
అసోసియేషన్‌లో మొత్తం 927 మంది న్యాయ వాదులు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షులుగా కొరివి వేణుగోపాల్ డి మల్లయ్య, లింగంపల్లి నాగరాజు లు పోటీ పడుతున్నారు. ఇందులో కొరివి వేణుగోపాల్, డి. మల్లయ్యలు గతంలో అధ్యక్షులుగా పని చేయగా నాగరాజు కార్యదర్శి గా పని చేశారు. వీరి ముగురి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది.
ఉపాధ్యక్షులుగా కొత్త ప్రకాష్, చందా రమేష్, పెంచాల శ్రీనివాస్,సయ్యద్ సాబీర్లులు, ప్రధాన కార్య దర్శిగా కందుల అరుణ్ కుమార్, చెల్లోజు భూమాచారి, చంద్రపతి కిరణ్ కుమార్, బూడిద మల్లేశం,శతరాజు ప్రదీప్ కుమార్ రాజులు పోటీలో ఉన్నారు. సంయుక్త కార్యదర్శిగా సుంకే దేవకిషన్, సిరికొండ శ్రీధర్ రావు, పెరక శ్రీనివాసులు, కోశాధికారిగా ముద్దసాని సంపత్, కీర్తి శ్రీధర్ లు పోటీలో ఉన్నారు. స్పోరట్స్ అండ్ కల్చరల్, లైబ్రరీ, కార్యదర్శి, జూనియర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ల లకు పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అసోసియేషన్ మహిళా ప్రతినిధిగా గంధి రజని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కాసుగంటి మాధవరావు ప్రకటించారు. ఈ ఎన్నికలు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించనుండగా సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.