09-03-2025 12:00:00 AM
విద్యార్థులు చదువులో రాణించి రాష్ట్రానికి పేరు తేవాలి
చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో అభివృద్ధి పనులకుశంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం రూ.500 కోట్లే కాదు అదనంగా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. యూనివర్సిటీ అభివృద్ధి బాధ్యత తనదేనని సీఎం స్పష్టం చేశారు. వ్యాపారంలో అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడేలా కార్యచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఆడబిడ్డలంటే వంటింటి కందేళ్లు కాదన్నారు.
మహిళలు వ్యాపారంలో రాణించేందుకు ప్రభుత్వం ప్రోత్స హిస్తుందన్నారు. కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అన్ని రంగా ల్లో మహిళలను వృద్ధిలోకి తేవడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని రంగాల్లో రాణించాలంటే ముందుగా విద్యలో రాణించాలని పేర్కొన్నారు. మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐల మ్మ పేరు పెట్టడం తెలంగాణకు గర్వకారణమన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలల్నినిజం చేయాలని కోరారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిం చే రోజులు దగ్గర్లోనే ఉనానయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మహిళల రిజర్వేషన్ల కో సం మాజీ ప్ర ధాని రాజీవ్ గాంధీ బాట లు వేశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థ లు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చేందుకు సోనియాగాంధీ ఎంతో కృషి చేసినట్టు తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీలలో కూడా మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చే రోజు త్వరలోనే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశం ఇస్తే నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సంక్షే మం కోసం ఉచిత బస్సు సౌకర్యం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీకి అందజేయనున్నట్టు సీఎం తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహా యక సంఘాలకు అప్పజెప్పినట్టు రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. విద్యార్థుల యూనిఫాంలు కుట్టే బాధ్యత కూడా మహిళలకే ఇచ్చినట్టు తెలిపారు.
30నెలల్లో పనులు పూర్తికావాలి
యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే, చదువుల్లో రాణించి విద్యార్థినులు రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ క్రమంలోనే 30 నెలల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, యూనివర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్, మిగతా వర్సిటీల వీసీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.