calender_icon.png 1 March, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుని కుటుంబానికి పరిహారం

01-03-2025 07:08:47 PM

పటాన్ చెరు: ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శక్తి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు కృష్ణారావు శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా మృతి చెందిన కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు రవి సింగ్, స్థానిక బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపి కుటుంబానికి రూ. 9 లక్షలు పరిహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ రెడ్డి, అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.