calender_icon.png 3 April, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం

26-03-2025 01:10:12 AM

వికారాబాద్, మార్చ్-25: పారిశ్రామిక పార్క్ కు భూములను ఇచ్చేందుకు సమ్మతి తెలిపిన  రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.మంగళవారo కలెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా  స్థాయి సంప్రదింపుల కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన దుద్యాల మండలం హకీం పెట కు  సంబంధించి  114  మంది రైతులతో సంప్రదింపులు కార్యక్రమము నిర్వహించారు .ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హకీం పెట్ గ్రామం లో మొత్తం పట్టా భూమి  146 .34   గుం టల భూమి ఉందని, స్వచ్చందంగా ముందు కు వచ్చిన  రైతులతో  అగ్రిమెంటు తీసుకొని  ముందుకు వేళతామన్నారు. జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ నిర్ణయం ప్రకారము  అవార్డు, చెక్  డిస్ట్రిబ్యూషన్  ఉంటుందన్నా రు.  సమ్మతి అవార్డు పొందిన రైతులకు  ఒకే విడత లో  చెక్కుల ద్వారా నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.   ఎకరానికి 20 లక్షలు, 150 గజా ల ఇంటి స్థలములో ఇందిరమ్మ ఇల్లు, అర్హత మేరకు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.