calender_icon.png 5 December, 2024 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పరిహారం

15-10-2024 12:26:45 AM

నిజామాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.86.38 లక్షలు మంజూరు చేసినట్టు జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ సోమవారం తెలిపారు. వరదలతో జిల్లాలో 676 మంది రైతులు పంట నష్టపోయారని ఆయన తెలిపారు. మంజూరైన పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు.