25-02-2025 12:00:00 AM
వికారాబాద్, ఫిబ్రవరి 24: పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, హకీంపేట కు సంబంధించిన రైతులకు నష్ట పరిహార చెక్కులను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన రైతులు ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నష్టపరిహారం పొందిన రైతులు తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇట్టి డబ్బులను వినియోగించు కోవా లని కలెక్టర్ సూచించారు. అనంతరం పారిశ్రామిక పార్కుకు భూములను కేటాయిం చిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుద్యాల తహసిల్దార్ కిషన్, హకీంపేట రైతులు పాల్గొన్నారు.