13-02-2025 12:00:00 AM
బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) ః బస్వాపురం ప్రాజెక్టులో భూములు ఇండ్లు సర్వస్వం కోల్పోయిన బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులకు నష్టపరి హారం చెల్లించాలని కోరుతూ బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.
ప్రభుత్వం నుండి నష్టపరిహారం విడుదలై మూడు నెలలు గడుస్తున్నా అధికారులు నిర్వాసితు లకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. కాలయాపన చేయడానికి గల కారణాలు ఏమిటి అని ప్రశ్నించారు. త్వరలో గ్రామ సభ పెట్టి వారి ఖాతాలలో జమ చేస్తామని జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి తెలి పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో గ్రామ స్తులు వల్దాస్ రాజు, కాలభైరవ, వల్లందాసు గణేష్ హరినాథ్, సుదర్శన్ పాల్గొన్నారు.