calender_icon.png 17 April, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి

08-04-2025 06:43:06 PM

హైకోర్టు తీర్పు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి..

టేకులపల్లి (విజయక్రాంతి): హైకోర్టు తీర్పు అమలు చేసి టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓసీ-2 ఫిట్-2, 3 భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం లచ్చగూడెంలో జిల్లా కలెక్టర్ ను కలిసి నిర్వాసితుల సమస్యను విన్నవించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారని తెలిపారు.

సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గిరిజన నిర్వాసితులు అన్యాయానికి గురవుతున్నారని వివరించారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వెంటనే సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు దొడ్డ సంపత్ కుమార్, దొడ్డ కోటేశ్వరరావు, చీమల క్రిష్ణ, దొడ్డ లక్ష్మయ్య, దనసరి భారతమ్మ, కొర్స లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.