13-03-2025 11:47:35 PM
రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం
మునుగోడు,(విజయక్రాంతి): ఎండిన వరి పంట పొలాలకు నష్టపరిహారం ఒక ఎకరానికి రూ.30 వేలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలంరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని కాల్వలపల్లి రెవిన్యూ గ్రామ పరిధిలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఎండిన వరి పంట పొలాలను పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వలపల్లి గ్రామంలో వరి సాగు చేసిన రైతులు 630 మంది , ఎండిపోయిన పంట సాగు 160 ఎకరాలు , 560 రైతులు తాము సాగుచేసిన వరి సాగు ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయినారని అన్నారు.ఈ కార్యక్రమంలో గొర్ల, మేకల తెంపకదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాగర్ల మల్లేష్ , శివర్ల వీరమల్లు , రమేష్, మల్లేష్ , లక్ష్మయ్య, సైదులు , ఎల్లయ్య , రాములు , అంజయ్య , లింగస్వామి తదితరులు ఉన్నారు.