calender_icon.png 20 April, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి

04-04-2025 01:19:07 AM

 తెలంగాణ రైతు సంఘం డిమాండ్

జనగామ, ఏప్రిల్ 3(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఎండిన పంటలకు ఎకరాకు ర.50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో అండాలుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ.. జనగామ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలను నింపి రైతుల పంటలను కాపాడాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను, కాలువలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఫర్టిలైజర్ షాపుల్లో కల్తీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టాలన్నారు.

కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల సారయ్య, మంగ బీరయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఉర్సుల కుమార్ ,  బోడ రాములు, నాయకులు కర్రె రాములు, కర్రె  సత్తయ్య, కర్రె బీరయ్య, రామచొక్కం, సిద్ధిమల్లయ్య, ఆసర్ల ఐల్లయ్య, కర్రె శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.