calender_icon.png 26 November, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ కు అనుగుణంగా పరిహారం ఇవ్వాలి

05-11-2024 11:20:57 AM

సబ్ కలెక్టర్ ను కలిసిన భూ నిర్వాసితులు..

నిజాంసాగర్: హైదరాబాద్, బోధన్ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న తమకు ప్రస్తుత మార్కెట్ కు అనుగుణంగా పరిహారం చెల్లించాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలో సబ్ కలెక్టర్ కిరణ్మయికి బాధితులు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా మహమ్మ ద్ నగర్ మండల కేంద్రంతో పాటు బూర్గుల్ గ్రామ శివారులో రహదారి విస్తరణ పనుల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.30 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్ ను కోరారు. ఈ విషయమై సాను కూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ హైవే అధికారులతో, జిల్లా కలెక్టర్ మాట్లాడి పరిహారం గిట్టుబాటు అయ్యేలా చూస్తానని ఆమె ఇచ్చారు. సబ్ కలెక్టర్ కలిసిన వారిలో మహమ్మద్ నగర్ వ్యాపారస్తులు జక్సాని శ్రీనివాస్ గుప్తా, రాము, దుబ్బ నాగరాజు గుప్తా, ఎలగందుల ప్రవీణ్, చింతల సంతోష్, దుర్గ నరేష్ తదితరులు ఉన్నారు.