calender_icon.png 7 January, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం

06-01-2025 12:47:26 AM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

గద్వాల, జనవరి 5 (విజయక్రాంతి):  గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున అందిస్తున్న నష్టపరిహారానికి సంబందించిన   మూడో విడతలో 23 మం ది రైతులకు 1,95,23,960  విలువ గల చె క్కులను ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బం డ్ల కృష్ణ మోహన్ రెడ్డి అందచేశారు. 

ఈ సం దర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కృష్ణ మ్మ వరదలతో ముంపుకు గురైన రేకులపల్లి గ్రామం సమీపంలోని జెన్కో దగ్గర 67 ఎక రాల వరకు రైతులు తమ భూములను కో ల్పోవడం జరిగిందని దాదాపుగా 46 మంది రైతులు తమ భూములను త్యాగం చేసి జె న్కోలో విద్యుత్ ఉత్పత్తికి సహకరించినందుకే నేడు ప్రజలకు నాణ్య మైన కరెంటు సరఫరా కావడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభా న్, జమ్ములమ్మ ఆలయ చైర్మన్ వెంకట్రా ములు, కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ దేవాలయ చైర్మన్ సతీష్, సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, గోపి రెడ్డి, హనుమంత్ రెడ్డి,  కు రుమన్న, గోవిందు, ధర్మానాయుడు, కాంబ్లె, నాగేంద్ర యాదవ్, రామాంజనేయులు, రాజు,  తదితరులు పాల్గొన్నారు.