18-04-2025 12:03:23 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 17(విజయక్రాంతి): పంటలు, పెంపుడు జంతువులపై అటవీ జంతువుల దాడి ఘటనలతో నష్టపోయిన రైతులకు గురువారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దేవరాజు రైతులకు నష్టపరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా వారి కార్యాలయంలో రైతులకు పరిహారం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నామని గ్రామాల్లోకి వన్యప్రాణులు ప్రవేశిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వెల్దండ మండలంలోని సి. రవీందర్ రెడ్డి, గంటల లక్ష్మయ్య, నరసమ్మ, సైదమ్మ, ఊరుకొండ మండలానికి చెందిన బి. ఆంజనేయులు, బి. లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్, పి.పద్మ, వంగూరు మండలానికి చెందిన బయ్య శ్రీనివాసులు, బిజినపల్లి మండలానికి చెందిన కుప్పిరెడ్డి ఉపేందర్ రెడ్డి సహా మొత్తం పదిమంది రైతులకు, అటవీ జంతువుల కారణంగా తమ పంటలకు, పెంపుడు జంతువులకు జరిగిన నష్టానికి 3.12లక్షల నష్టపరిహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి చంటి, ఇతర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.