17-04-2025 07:28:49 PM
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
మైనారిటీ జిల్లా అద్యక్షులు ఎండీ యాకూబ్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఆపద్బాందు పేరుతో రూ.50 వేలు చెల్లించేవారని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పట్టణ, స్థానిక సంస్థల ప్రజలు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, రోజువారి కూలీలు వడదెబ్బతో మృతి చెందుతున్న బాధితుల పట్ల సహృదయంతో స్పందించి అట్టి కుటుంబాలను ఆదుకోవాలనే దృడ సంకల్పంతో పరిహారాన్ని పెంచటం శుభపరిణామమన్నారు. అధికారులు ఇట్టి విషయమై మున్సిపాలిటీ, ఎంపిడిఓ, తహశీల్దారు కార్యాలయంలో ఈ పథకం పట్ల అవగాహన కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని యాకూబ్ పాషా కోరారు.