calender_icon.png 14 January, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ లో మృతి చెందిన భారతీయుడికి 55 లక్షల నష్టపరిహారం

13-01-2025 11:30:40 PM

నష్టపరిహారం అందజేసిన యాప్ లీగల్ సర్వీసెస్...

నిజామాబాద్ (విజయక్రాంతి): గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపి నిస్సేరి మృతి చెందిన బాధితుడి సంబంధిత వ్యక్తులకు 55 లక్షల రూపాయల పరిహారం యాబ్ అందజేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జాగర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజా 2022 డిసెంబర్ 27న చార్జర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదం జరిగిన ప్రాంతం పారిశ్రామికవాడలోని అనధికార స్థలంలో రోడ్డు దాటుతుండగా పాకిస్తాన్ చెందిన వాహనదారుడు తన వాహనంతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన గద్దలరాజాను షార్జా అల్ కసిమియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ఆయన మృతి చెందాడు. మరణించిన గద్దల రాజాపై రహదారి దాటినందుకు అభియోగం మోపడం ద్వారా కేసును ముగించారు. 

ఆ సమయంలోనే గద్దలరాజా అతని బంధువైన రాజారాం. గద్దల రాజన్న రక్తసంబంధీకులు సర్వీసెస్ సీఈవో సలాం పాపి నిస్సరికి కేసును అప్పగించారు. రోడ్డు దాటుతున్న పాదాచారులను పట్టించుకోకుండా వాహనం నడిపిన పాకిస్తానీ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాప్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కోర్టులో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా షార్జా కోర్టులో న్యాయవాదులు కేసు నమోదు చేయడంతో తిరిగి కేసు న్యాయస్థానం ముందుకు వచ్చింది. వల్ల యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కేసు నడపడంతో మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందజేశారు. లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపి నిసిపిరిని సోమవారం నిజామాబాద్ జిల్లాలోని జాగరియాల్ చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి గత 15 సంవత్సరాలుగా మాయాబ్ లీగల్ సర్వీసెస్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. 

న్యాయం జరిగే విధంగా తమ సంస్థ కృషి చేస్తుందని సగటు భారతీయుడికి సౌదీ అరబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారు యాప్ లీగల్ సర్వీసెస్ నువ్వు ఆశ్రయించినా మరుక్షణమే వారికి న్యాయం జరిగే దిశగా పోరాటం సాగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు నిజామాబాద్ రావడం రాజు కుటుంబానికి డబ్బులు అందజేయడం తమకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందని ఈ సంఘటన జీవితంలో మర్చిపోలేము అని యాప్ లీగల్ సర్వీసెస్ సీఈవో ఆనందంతో తెలిపారు. జాబ్ లీగల్ సర్వీసెస్ సీఈఓ తో పాటు అరబ్ కంట్రీ సంస్థ సభ్యుడు షేక్ అల్ అజీజ్ అబ్దుల్ రావు ఫ్ మునీత్ తదితరులు ఉన్నారు.