17-12-2024 01:42:46 AM
* లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): కొవిడ్ సమయంలో కంటోన్మెంట్ లో 100 మందికిపైగా పారిశుద్ధ్య కార్మికు లు చనిపోయారని, వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంటులో కోరారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్‌లోని పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు పడుతున్న బాధలను సభ దృష్టికి తీసుకెళ్లారు. చనిపోయిన కుటుంబసభ్యులకు కారుణ్య నియామాకాలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే రక్షణ మంత్రికి సైతం వినతిపత్రం ఇచ్చినట్టు గుర్తుచేశారు.