calender_icon.png 30 January, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీని గజినీతో పోల్చడం చౌకబారు తనం

29-01-2025 01:47:18 AM

* ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీని మహ్మద్ గజినీతో పోల్చతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు హిందూ ధార్మికతను అవమానించేలా ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

గజినీ దేశాన్ని దోచుకున్నాడని, హిం దూ దేవాలయాలను ధ్వంసం చేసి మన సాంస్కృతిక వారసత్వాన్ని మట్టిలో కలిపాడని గుర్తుచేశారు. అలాంటి దోపిడీదారు డితో మోదీని పోల్చడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మోదీ నాయ కత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశం తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని తిరిగి చాటు కుంటోందని, సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్య రామమందిరం వంటి ఆలయాలను పునర్నిర్మించి హిందూ దేవాలయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందన్నారు.