calender_icon.png 22 September, 2024 | 2:22 PM

శివుని సాహచర్యం

20-09-2024 12:00:00 AM

దశమాధ్యాయ మహాత్మ్యాత్త త్త్వ జ్ఞానం సుదుర్లభం   

లబ్ధమేతేన మునినా జీవన్ముక్తి రియం తథా ॥

పూర్వం ఒకసారి బ్రహ్మదేవుని వాహన జాతికి చెందిన ఒక హంస ఒకానొక పద్మలత ద్వారా ‘భగవద్గీత’లోని పదవ అధ్యాయాన్ని వింటుంది. ఆ ఫలితంతో మరు జన్మంలో అది ఒక విప్రుడిగా జన్మిస్తుంది. ఈ పూర్వజన్మ జ్ఞానంతో అతను నిత్యం ‘భగవద్గీత’లోని దశమ అధ్యాయాన్ని పారాయణం చేయసాగాడు. దీనివల్ల సాక్షాత్తు శివుడు ఎల్లప్పుడూ ఆ విప్రుని వెంట ఉండసాగాడు. ఈ విషయాన్ని శివుడే స్వయంగా భృంగీశ్వరునితో చెప్పినట్టు శాస్త్రాలలో ఉంది. గీత దశమ అధ్యాయం శివునకు అత్యంత ప్రీతికరం. అందుకే, ఈ పారాయణం చేసిన వారికి అత్యద్భుతమైన పరమేశ్వరుని సాహచర్యం లభిస్తుంది.

  1. - కలకుంట్ల జగదయ్య