రాష్ట్ర హస్తకళల కార్పోరేషన్ ఛైర్మన్ సత్యనారాయణ గౌడ్...
నిర్మల్ (విజయక్రాంతి): సామాజిక సేవతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని రాష్ట్ర హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో సాయాజిక కార్యాకర్త సమతా సుదర్శన్ నిర్వహిస్తున్న సమత పౌండేషన్ కేంద్ర కార్యాలయంను ప్రారంభించారు. సమత సుదర్శన్ నిర్వహిస్తున్న సామాజిక కార్యాక్రమాలు పేద ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు. పేద చదువులు ఆటల్లో ప్రోత్సాహం అందిచాలని సూచించారు. ఈ కార్యాక్రమాలు జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని పేర్కోన్నారు. ఈ కార్యాక్రమంలో గిరిజన కార్పోరేషన్ చైర్మన్ తిరుపతి, మాజీ ముదోల్ ఎమెల్యేలు నారాయణ రావు పటేల్, విఠ్ఠల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం సుగుణ, పౌండేషన్ ఛైర్మన్ సమత సుదర్శన్ తదితరులు ఉన్నారు.