calender_icon.png 8 April, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభం

07-04-2025 07:04:51 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను సోమవారం నాడు ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... న్యాయ సేవ ప్రాధికార సంస్థ న్యూఢిల్లీ (నల్సా), తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎల్లారెడ్డి గాంధారి నాగిరెడ్డిపేట్ లింగంపేట్ మండలాలలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ప్రారంభించడం జరిగిందని, వీటి ప్రారంభంతో స్థానిక స్థాయిలో ప్రజలకు త్వరితగతిన న్యాయం అందుబాటులోకి రావడం, కేసులు కోర్టుకు వెళ్లకముందే పరస్పర సహకారంతో పరిష్కార మార్గాలను కనుగొనడం సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్, కమ్యూనిటీ మీడియేషన్ వాలంటర్లు కే శ్రీనివాస చారి, ప్రతాపరెడ్డి, సంగప్ప, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.