07-04-2025 06:32:14 PM
జుక్కల్ (విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని జుక్కల్ గ్రామ పంచాయతీలో సోమవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బిచ్కుంద జూనియర్ జడ్జి పిలుపునకు జుక్కల్ ఎస్ఐ వెంకట్రావు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. స్థానిక కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ (న్యాపరమైన సేవలు) కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రజల సమస్యలను పరిష్కరం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు రాము, రామ్ పటేల్, నాగనాథ్, గ్రామ పెద్దలు లక్ష్మణ్ బల్లి, తదితరులు పాల్గొన్నారు.